Kakinada Janasena MP Candidate : కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్..!!

కాకినాడ నియోజకవర్గం( Kakinada Constituency ) నుండి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్( Uday Srinivas ) పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.తన కోసం ఉదయ్.

 Kakinada Janasena Mp Candidate : కాకినాడ ఎంపీ అభ్య-TeluguStop.com

పిఠాపురం సీటును త్యాగం చేశారని తెలియజేశారు.అయితే అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు ఉదయ్ తాను స్థానాలు మార్చుకుంటామని పేర్కొన్నారు.పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ సీట్లు తమకెంతో ముఖ్యమని అన్నారు.2024 ఎన్నికలను పవన్( Pawan Kalyan ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదని ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులకు శ్రీకారం చుట్టడం జరిగింది.టీడీపీతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ పెద్దలను పవన్ కళ్యాణ్ ప్రాధేయపడి ఒప్పించారు.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడ్డారు.ఇదే విషయాన్ని మంగళవారం తెలియజేశారు.జనసేన( Janasena ) లేకపోతే పొత్తులు ఉండేవి కావు.బీజేపీ( BJP ) పెద్దలను తానే ఒపించినట్లు పవన్ వ్యాఖ్యానించారు.

2024 ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుండి 21 మంది అసెంబ్లీ ముగ్గురు పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు.ఈసారి భారీ ఎత్తున విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు.2019 ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలవడం జరిగింది.రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలిచారు.

ఆ సమయంలో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోవడం జరిగింది.కానీ ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి గెలిచి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube