మరణించిన పార్టీ కార్యకర్తలకు ₹5 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ పార్టీని టార్గెట్ గా చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

నేరపూరితమైన నాయకులు పరిపాలన చేస్తే సమాజంలో దౌర్జన్యం పెరిగిపోతుందని.వచ్చే ఎన్నికలలో ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేయాలని అప్పుడు లా అండ్ ఆర్డర్ కి పెద్దపేట వేస్తామని సభలలో పవన్ హామీ ఇవ్వడం తెలిసిందే.

అంతేకాకుండా తనని ఈసారి ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.జూన్ 14వ తారీకు మొదలైన వారాహి యాత్ర కత్తిపూడి, పిఠాపురంలో రెండుచోట్ల రోడ్ షోలు నిర్వహించడం జరిగింది.

Pawan Kalyan Announced ₹5 Lakh For Deceased Party Workers

అయితే కత్తిపూడిలో జరిగిన సభలో ఒకరు మృతి చెందడం తెలిసిందే.పిఠాపురంలో జరిగిన సభలో చెట్టు కొమ్మ విరిగిపడి దాదాపు 20 మంది గాయాల పాలయ్యారు.ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు చనిపోతే ₹5 లక్షలు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.

Advertisement
Pawan Kalyan Announced ₹5 Lakh For Deceased Party Workers-మరణించ�

ఇదే సమయంలో వేరువేరు ప్రమాదాలలో చనిపోయిన పార్టీ కార్యకర్తలకు కాకినాడలో పవన్ నివాళులు అర్పించడం జరిగింది.జనసేనకు మొత్తంగా 6.76 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.పార్టీ స్థాపించినప్పుడు 50వేల మంది ఉంటారని అనుకోలేదు.

పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు నేను.మిగతా జనసైనికులు అండగా ఉంటాము.

అని భరోసా ఇచ్చారు.ఇదే సమయంలో కాకినాడలో "జనవాణి" నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు