Director Venu Udugula: ఒక్క వేణు ఉడుగుల మాత్రమే బలిపశువు కాదు..ఎందరిదో ఈ వేదన

విరాటపర్వం సినిమా( Virata Parvam ) విడుదల అయి ఏడాది గడిచిన కారణంగా ఆ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల( Director Venu Udugula ) తన నిద్ర లేని రాత్రుల గురించి, మార్కెట్ కొట్టిన దెబ్బ గురించి చాల భావోద్వేగ భరితమైన ఒక పోస్ట్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు.ఈ పోస్ట్ చూసాక ఒకటి అనిపించింది.

 Director Venu Udugula: ఒక్క వేణు ఉడుగుల మాత�-TeluguStop.com

ఇది ఒక్క వేణు కి మాత్రమే కాదు.సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకొని గంపెడు ఆశలతో ఎన్నో ఏళ్లుగా నిద్ర లేని రాత్రులను గడుపుతున్న యువత అనుభవిస్తున్న మనోవేదనలా అనిపించింది.

ఒక్క అవకాశం అయినా దొరక్క పోతుందా అని పది కి పైగా బౌండెడ్ స్క్రిప్ట్స్ ని పట్టుకున్న తిరుగుతున్న ఆశావాదుల ఆవేదన లాగ అనిపించింది.

సినిమా అవకాశం రావడం ఒక ఎత్తయితే వచ్చిన అవకాశం నిలబెట్టుకోవడం కత్తి మీద సవాల్.ఓటిటి, చిన్న సినిమా అంటూ ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యేది కేవలం ఒక్క శాతం మంది మాత్రమే.మిగతా వారంతా గెలిచినా వాడి చుట్టూ ఎదో ఒక డిపార్ట్మెంట్ లో ఉండి పోతారు.

సినిమా తీస్తున్న విధానం దగ్గర ఉండి చూసి వామ్మో బ్రతికి ఉంటె ఏ బలుసు ఆకు అయినా తినచ్చు కానీ ఈ సినిమా వద్దు అని నిర్ణయానికి వస్తారు.సినిమా తీయాలంటే ఒక తల్లి పురుటి నొప్పుల కన్నా దారుణమైన పరిస్థితి.

బ్యాగ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ మొదటి అవకాశం ఎలాంటి నొప్పి లేకుండా దక్కుతుంది.

సినిమా మొదలయ్యింది మొదలు నిర్మాతల పెట్టె టార్చర్, హీరో హీరోయిన్స్ ఇగోలు, మిగతా స్టార్ కాస్ట్ అట్టిట్యూడ్స్, బుడ్జెట్స్ టెన్షన్స్ అన్ని తట్టుకొని సినిమా పూర్తి చేస్తే మార్కెటింగ్ చేయడం మహా కష్టమైన పని.దర్శకుడి అదృష్టం బాగుంది పెద్ద నిర్మాత అయితే ఎదో ఒక తిప్పలు పడి థియేటర్స్ దక్కించుకుంటాడు.లేదంటే థియేటర్స్ ఉన్న సినిమా కంపెనీ ల చుట్టూ చెక్కర్లు కొట్టాల్సిందే.అప్పుడు మొదలెడతారు నీ సినిమా ఎంతకు అమ్ముతావ్ అని.పావులా, అర్ద కు బేరం మొదలు పెట్టి పీకి, నాకి, గోకి ఆ దర్శక నిర్మాతలను బ్రతికి ఉండగానే చంపేస్తారు.పోనీ ఎదో కర్మ కొద్దీ పెద్ద వ్యక్తి కి సినిమా నచ్చి సినిమా ను మార్కెట్ చేస్తే ఓటిటి ని ప్రసన్నం చేసుకోవాలి.ఏం బ్రతుకులు రా అయ్యా.

ఎవరినైనా ఈ పోస్ట్ ద్వారా బాధపెడితే క్షమించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube