పవన్ ను గట్టిగా దబాయించిన రానా.. ఏం జరిగిందంటే..?

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ చంద్ర డైరెక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం, మాటలతో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

పవన్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమాలో ఒక సన్నివేశంలో పవన్ ను రానా దబాయించాల్సి ఉంటుందని.

ఆ సీన్ లో పవన్, రానా ఇద్దరూ అద్భుతంగా నటించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ఈ మూవీలో మరోసారి పోలీస్ గా నటిస్తుండగా పవన్ ను ఎదురించే పాత్రలో రానా నటించనున్నారు.

సన్నివేశాలు పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.రానా ఒక సన్నివేశంలో పవన్ ను మెల్లిగా దబాయిస్తే గట్టిగా దబాయించమని పవన్ చెప్పి రీ టేక్ చేయించారని సమాచారం.

Pawan Kalyan And Rana Daggubatis Ayyappanum Koshiyum Telugu Remake Shooting Upda
Advertisement
Pawan Kalyan And Rana Daggubatis Ayyappanum Koshiyum Telugu Remake Shooting Upda

మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా పవన్ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.పవన్ సినిమా సన్నివేశాన్ని ఇలా రీటేక్ చేయించడంతో పవన్ చాలా మారిపోయారని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.పవన్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ లో విడుదల కానుండగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

పవన్ క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.రీఎంట్రీలో పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు.

ఈ ఏడాది గ్యాప్ లో పవన్ నుంచి మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు