ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సెన్స్, కంటెంట్, స్టోరీ ఇలా ఏమి లేకుండా తీసే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది బోయపాటి శ్రీనునే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అప్పట్లో ఈయన సినిమాల్లో కథ బలంగా ఉండేది.
కథలో అంతర్లీనంగా యాక్షన్ సన్నివేశాలు ఉండడం తో ‘భద్ర’ , ‘సింహా’ లాంటి సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి.కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో కథ ని పూర్తి గా పక్కన పెట్టేసి, మితిమీరిన హింసతో కూడిన యాక్షన్ సన్నివేశాలను రాసుకుంటూ దాని చుట్టూ కథలు అల్లేస్తున్నాడు.
రీసెంట్ గా విడుదలైన రామ్ ‘స్కంద( Skanda )చిత్రం అలాంటిదే.కేవలం బాలయ్య సినిమాలకు మాత్రమే ఆయన కథ మరియు కంటెంట్ పట్ల శ్రద్ద చూపిస్తాడు.
మిగిలిన హీరోలతో మాత్రం అవి పూర్తిగా మర్చిపోతాడు.అందుకే స్టార్ హీరోలు ఇతనితో సినిమాలు చెయ్యడానికి పెద్దగా ఇష్టపడరు.

నేటి తరం మాస్ హీరోలు గా పిలబడే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ‘దమ్ము ‘, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలు చేసాడు.రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.లెజెండ్ చిత్రం తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు.ఒక రోజు పిలిచి కథ చెప్పమని బోయపాటి శ్రీను ని అడిగాడు.
పిలిచినా వెంటనే వచ్చి కథ వినిపించడం మొదలు పెట్టాడు.బోయపాటి శ్రీను మొదలు పెట్టిన 10 నిమిషాలకే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి పిచ్చెక్కిపోయి అర్జెంటు గా వేరే పని గుర్తుకువచ్చింది, మిగిలిన కథ రేపు వింటాను సార్, మీకు కబురు చేస్తాను అని చెప్పాడట.
అంతే ఆ తర్వాత రోజు నుండి పవన్ కళ్యాణ్ వైపు ఎలాంటి కబురు అందలేదు, ఇక చివరికి అల్లు అర్జున్ తో ‘సరైనోడు( Sarrainodu )’ చిత్రాన్ని సెట్ చేసాడు.

ఈ చిత్రాన్ని మాత్రం బోయపాటి శ్రీను తన స్టైల్ మరియు అల్లు అర్జున్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి తీసాడు.ఫలితం అదిరిపోయింది, అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.కొన్ని ప్రాంతాలలో ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టేసింది.
ట్రేడ్ పండితులు కూడా ఈ చిత్రం కి వచ్చిన రన్ ని చూసి నోరెళ్లబెట్టారు.స్టార్ హీరోలలో బోయపాటి శ్రీను కొట్టిన ఏకైక హిట్ ఇదే.ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.బోయపాటి శ్రీను ఇప్పటికైనా కేవలం మాస్ సన్నివేశాల మీద మాత్రమే ద్రుష్టి పెట్టకుండాల, కథ మరియు కంటెంట్ మీద శ్రద్ద పెడితే బాగుంటుంది.
లేకపోతే ఆయన కెరీర్ ముగిసినట్టే అని అంటున్నారు విశ్లేషకులు.







