యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించే విధంగా లోకేష్ ప్రణాళికను రచించుకున్నారు.
అనుకున్న మేరకు లోకేష్ పాదయాత్రకు స్పందన వస్తూ ఉండడం టిడిపి వర్గాల్లో జోష్ నింపుతోంది.ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్రను చేస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.దీంతో పాటు ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.

టిడిపి జనసేన ఇంకా పొత్తులు పెట్టుకునే ప్రతిపాదనలోనే ఉన్నాయి తప్ప, పూర్తిగా ఒక క్లారిటీకి రాలేదు.ఎన్నికల సమయం నాటికి దీనిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు.అయితే జనసేన, టిడిపి కలిసే పోటీ చేస్తాయని పవన్ అభిమానులు డిసైడ్ అయిపోయినట్టుగా ఈ ఫ్లెక్సీ చూస్తే అర్థమవుతుంది.దీనికి తగ్గట్లుగానే లోకేష్ కూడా తను పాదయాత్ర ప్రసంగాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు.

తన యువగళం పాదయాత్ర ఆగదని, పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర కూడా ఆగదు అంటూ చెబుతూనే సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు.ఈ ఈ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్రకు స్వాగతం చెబుతూ పవన్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు కట్టినట్లుగా కనిపిస్తున్నారు.ఈ వ్యవహారాలపై అటు టిడిపి శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పకుండా నిజం దక్కుతుందని అంచనా వేస్తున్నాయి.







