కృష్ణ విజయనిర్మల గారి ఆశీస్సులు ఎప్పుడు మా జంటపై ఉంటాయి: పవిత్ర లోకేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించినటువంటి వారిలో నటుడు నరేష్ ( Naresh ) పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh )జంట ఒకటి.

వీరిద్దరూ వీరి వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

నటుడు నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు.అయితే ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.

త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెలియడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ( Ramya Ragupathi ) ఏ స్థాయిలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిందో మనకు తెలిసిందే.

ఇకపోతే నరేష్ తన వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా మళ్లీ పెళ్లి ( Malli Pelli ) అనే సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసాయి.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో నటి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ విజయకృష్ణ మూవీస్ ను తిరిగి లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ బ్యానర్ ను ఇలా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఇది తెలుగువారు గర్వపడాల్సిన విషయమని పవిత్ర లోకేష్ తెలిపారు.ఇక విజయం నిర్మల( Vijaya Nirmala ) గారు కృష్ణ ( Krishna )గారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా జంటపై ఉంటాయి అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో నరేష్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే కాకుండా కృష్ణ కుటుంబ విషయాలను కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement
https://telugustop.com/wp-content/uploads/2023/05/10000000_273917754983002_7011867469488023748_n.mp4

తాజా వార్తలు