బిఆర్‌ఎస్( BRS party ) పార్టీ జాతీయ పార్టీగా అడుగులేసిన తొలినాళ్ళ నుంచి కూడా కర్నాటక నుంచి జెడిఎస్ తరుపున కుమారస్వామి మద్దతు పలుకుతూ వచ్చారు.బిఆర్‌ఎస్ ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతు వచ్చారు.
కేసిఆర్ కర్నాటకలో జెడిఎస్ తోనే తమ పొత్తు అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.దీంతో బిఆర్‌ఎస్ జెడిఎస్ కలిసి కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయనే వార్తలు బలపడుతూ వచ్చాయి.
కట్ చేస్తే ఎన్నికల సమయానికి ఎవరికి వారే యెమున తీరే అన్నట్లుగా అటు కేసిఆర్ ఇటు కుమారస్వామి ఎడమొఖం పెడమొఖం అయ్యారు.

కర్నాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కేసిఆర్ విరమించుకున్నారు.కుమారస్వామి కూడా బిఆర్‌ఎస్ ప్రస్తావన తీసుకురాలేదు.దీంతో జెడిఎస్, బిఆర్‌ఎస్ పార్టీల మద్య దూరం పెరిగిందా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.
అయినప్పటికి దీనిపై పూర్తి స్పష్టత లేదు.అయితే కుమారస్వామి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టె విధంగానే ఉన్నాయి.
కర్నాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చడంతో.జెడిఎస్ వైఖరిని భహిర్గతం చేశారు కుమారస్వామి.
హంగ్ ఏర్పడితే తాము బీజేపీ తోనైనా, కాంగ్రెస్ తోనైనా కలవడానికి సిద్దంగా ఉన్నామని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కేసిఆర్ ను ఇబ్బంది పెట్టె విధంగానే ఉన్నాయి.జెడిఎస్ ఆల్రెడీ కేసిఆర్ తో కలిసి ఉండడంతో ఒకవేళ ఆ పార్టీ బీజేపీతో( BJP ) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ బిఆర్‌ఎస్ మద్య అంతర్గత సంబంధాలు ఉన్నాయనే విమర్శలను కాంగ్రెస్ గట్టిగా గుప్పిస్తుంది.ఒకవేళ కాంగ్రెస్ తో కలిసినా.
బీజేపీ కూడా ఇదే విధంగా విమర్శలు చేస్తుంది.బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్య దోస్తీ ఉందని కమలనాథులు తెలంగాణలో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.
అద్నువల్ల జెడిఎస్ తో సక్యతగా ఉండడం వల్ల ఎటొచ్చీ కేసిఆర్ కే( CM KCR ) ముప్పు వాటిల్లుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసిఆర్ వ్యూహాత్మకంగా కుమారస్వామికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.







