తాడో పేడో తేల్చుకుంటున్న పవన్?

ఏలూరు లో వారాహి( Varahi yatra ) మలివిడత బహిరంగ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టిన పవన్ కాగ్ నివేదిక ఆధారంగా పాయింటు టూ పాయింట్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ చెలరేగిపోయారు.అయితే మొత్తం స్పీచ్ లో వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు పక్కకెళ్ళిపోయి వాలంటీ( Volunteers )ర్ వాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

 Pavan Wants To Face The Consequences , Pawan Klayan , Jana Sena, Ap Politics, Ys-TeluguStop.com

పవన్ వ్యాఖ్యలను అస్త్రంగా ఉపయోగించుకున్న అధికార పార్టీ పవన్ పై ముప్పేట దాడి చేస్తుంది.వాలంటీర్ వ్యవస్థతో ఎక్కడకక్కడ ధర్నాలు చేయిస్తూ పవన్ పై కేసుల పెట్టిస్తుంది.

నిరసన ప్రదర్శనలు దిష్టిబొమ్మ దగ్ధం చేయడాలు ఇలా రాష్ట్రవ్యాప్తంగా పవన్ పై వ్యతిరేకత వచ్చే కార్యక్రమాలను చేస్తుంది.

Telugu Ap, Ap Volunteers, Jana Sena, Pawan Klayan, Ys Jagan-Telugu Political New

అయితే లక్షల మంది ఉన్న వ్యవస్థ పై తమ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం జనసైనికులకు కూడా కొంత ఇబ్బందిగా మారింది .ఇది వచ్చే ఎన్నికలలో పార్టీకి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుందో అన్న అనుమానంతో పవన్( Pawan kalyan ) తన తర్వాతి స్పీచ్ లలో తన వ్యాఖ్యలను సవరించుకుంటారని జన సైనికులు ఎదురుచూశారు.అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తన తదుపరి స్పీచ్ లలో కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Telugu Ap, Ap Volunteers, Jana Sena, Pawan Klayan, Ys Jagan-Telugu Political New

తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని ఎన్ని లక్షల మంది వచ్చినా నేను ఒక్కడినే నిలబడగలను అంటూ ఆయన చెప్పుకొచ్చారు .వాలంటీర్ వ్యవస్థ వల్ల కచ్చితంగా రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని, అతి సున్నితమైన డేటాను సేకరిస్తున్న వీరు అది ఎవరి వద్దకు చేరుతుంది అన్న స్పష్టత కూడా వాలంటీర్లకు లేదని, అందరినీ తాను అనడం లేదని కానీ ఖచ్చితంగా వీరిలో కొందరు సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారంటూ ఆయన మాట్లాడారు .ఈ విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చినా తట్టుకోవడానికి మానసికంగా సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది మరి ఈ పట్టుదల ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube