పొత్తులపై పవన్ స్టాండ్ మారుతుందా?

రాజకీయాల్లో ఏప్పుడు ఏమైనా జరగవచ్చు.

అవసరాలు బట్టి అవకాశాలను బట్టి పొత్తులు ఏర్పరుచుకోవడం లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడిపోవడం రాజకీయాల్లో సహజమే .

పైకి ఎంత గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చినప్పటికి రాజకీయ అధికారమే పరమావధిగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి .నిన్న మొన్నటి వరకు ఎదుర్కొన్న పరిస్థితికి ప్రస్తుతం జనసేన ఎదుర్కుంటున్న పరిస్థితి కి పూర్తి తేడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ప్రతి విషయంలోనూ తనను అవమానించి కంట్రోల్ చేయాలనిచూసిన వైసిపి ప్రభుత్వం మీద కోపాన్ని వ్యక్తిగతం గా తీసుకున్న పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఎట్టి పరిస్థితులలోనూ వైసీపీ ప్రభుత్వాన్నిగద్దె దించాలని ప్రతిన బూనారు.

తాను దైవ సమానం గా చూసుకునే అన్నను కూడా చర్చల పేరుతో అవమానించారనే కోపం కూడా పవన్ కి ఉందంటారు.

ఆ కోపాన్ని అవకాశం గా తీసుకున్న చంద్రబాబు( Chandrababu Naidu ) పొత్తుల దిశగా ఒక అడుగు ముందుకు వేసి కమిట్ చేయించారు .అయితే పవన్ ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత రాజకీయ పరిణామాలు వేగం గా మారాయి .క్రమగా తమ కు అనుకూల గాలి వీస్తుందని గమనించిన తెలుగుదేశం పార్టీ పవన్ కి ప్రదాన్యత తగ్గించింది .ఇవన్నీ నిశితం గా గమనిస్తున్న పవన్ పొత్తు పై నర్మగర్బం గా మాట్లాడుతున్నారు .పిటాపురం సభ లో అయితే తననే ముఖ్యమంత్రి అభ్యర్ది గా ప్రకటించుకున్నారు .

Advertisement

పొత్తును గౌరవప్రదంగా నిలబెట్టుకునే ఉద్దేశం కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకటనలో కానీ మహానాడు ప్రకటనలో కానీ ఆ పార్టీ పెద్దలస్పీచ్ లలో కానీ పొత్తు ఒక చారిత్రక అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా చెప్పాల్సిన తెలుగుదేశం నేతలు 150 సీట్లలో గెలుపు పొందుతాం 175 సీట్లు లో పోటీ చేస్తామని ప్రకటనలు చేసి ఉండేవారు కాదు.రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తాను ఒక మెట్టు దిగుదామనుకుంటే రెండు మెట్లు పైకెక్కుతున్నట్లుగా ఉన్న తెలుగుదేశం( TDP ) వ్యవహార శైలిపై పవన ఆగ్రహం గా ఉన్నారన్న విషయం ఆయన చేస్తున్న వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది.వారాహి యాత్రలో పూర్తిగా ఆయన జనసేనకి అవకాశం ఇవ్వమనే మాట తప్ప తెలుగుదేశం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అంతగా అవసరమైతే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లి అయినా కీలకమైన సీట్లు సాధించవచ్చు అన్న ధీమా జనసేనలో కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు .

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు