రేపు రాజమండ్రి లో చిరు, పవన్ పర్యటన ! ఫ్యాన్స్ లో టెన్షన్ 

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ, జనసేన మధ్య తలెత్తిన వివాదం ఒక పక్క రోజురోజుకూ ముదురుతోంది.

ఆన్లైన్ సినిమా టికెట్ విధానాన్ని పవన్ వ్యతిరేకించడంతో ఈ వివాదం మొదలవ్వగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పవన్ వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధం లేదు అని, పవన్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం అంటూ ప్రకటనలు చేశారు.

ఈ నేపథ్యంలో, సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.దీనిపై ఆయన త్వరలోనే స్పందించే అవకాశం ఉండడంతో ఆయన పవన్ కు మద్దతుగా మాట్లాడతారా లేక వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా అనే విషయం ఉత్కంఠ కలిగిస్తోంది.

ఇదిలా ఉండగానే రేపు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజమండ్రి లో పర్యటించబోతున్నారు.రాజమండ్రి పట్టణంలో ఉన్న అల్లు రామలింగయ్య ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించబోతున్నారు.

అలాగే అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.మెగా బ్రదర్స్ ఇద్దరి పర్యటనకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఒకపక్క వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్న సమయంలోనే, మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతుండడం, ఈ సినిమా టికెట్ల వ్యవహారంపై కానీ, పవన్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై కానీ, చిరంజీవి స్పందించే అవకాశం ఉంది అనే అంచనాలో అందరూ ఉన్నారు.కాగా ఈ వ్యవహారంపై మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారట.ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెటింగ్ విధానంను చిరంజీవి ప్రశంసిస్తే అప్పుడు పవన్ ఇరుకునపడతారు అనే టెన్షన్ వారిలో నెలకొంది.

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు