పవన్ కోపానికి కారణం ఇదా ? 

ఇక బీజేపీ తో తాడోపేడో అన్నట్లుగా వ్యవహరిస్తోంది జనసేన.కొద్ది రోజుల క్రితం తెలంగాణ బిజెపి శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు పవన్ చేశారు.

తెలంగాణ బిజెపి నాయకులు తమను బాగా అవమానించారని, అసలు ఆ పార్టీతో తమకు పొత్తు లేదు అన్నట్లుగా మాట్లాడారని, జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ కోసం త్యాగం చేసినా, దానిని గుర్తించకుండా అవమానానికి గురి చేశారని, అసలు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అంతే కాదు బిజెపి అభ్యర్థికి కాకుండా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కి జనసేన మద్దతు ప్రకటించింది.

ఇక తాజాగా ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను జనసేన ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో ఈ ఓటమికి కారణం బిజెపి అంటూ జనసేన నాయకుడు పోతిన మహేష్ తో చెప్పించారు.అయితే అకస్మాత్తుగా పవన్ కు బీజేపీ పై ఆగ్రహం కలగడానికి కారణం ఏమిటి ? తెలుగుదేశం పార్టీకి దగ్గర అందుకే ఈ విధంగా చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు పార్టీ లో నెలకొంది.బిజెపి కోసం జనసేన ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ వస్తోందని, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ,  అమరావతి రాజధాని విషయంలో కానీ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కానీ, బీజేపీ తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న, తమ మిత్రపక్షంగా ఉండడంతో ఆ పార్టీ ని ఏమీ అనలేని పరిస్థితి ఉంది.

అది కాకుండా బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు పవన్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా, ఆయన అపాయింట్మెంట్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఇప్పటికీ ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోవడం అదే సమయంలో ఏపీకి చెందిన కొంతమందికి ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తుండడం, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి వారికి అపాయింట్మెంట్లు దొరకడం , తనను మాత్రం దూరం పెట్టడం ఈ వ్యవహారాలపై జనసేన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి కారణాలతో పవన్ ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.దేశ వ్యాప్తంగా బిజెపి గ్రాఫ్ తగ్గుతుండటం, ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడం , ఏపీలో అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు బీజేపీ పై ఈ తిరుగుబావుటా ఎగురవేసినట్టు కనిపిస్తున్నారు.ఇప్పుడు చోటుచేసుకున్న పరిణామాలతో అయినా బిజెపి అగ్రనేతల అపాయింట్మెంట్ దక్కుతుంది అనే ఆశతో పవన్ ఉన్నట్లుగా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

తాజా వార్తలు