అవును, చైనా( China ) వైమానిక రంగంలో సరికొత్త అధ్యాయానికి పునాది పడింది.చైనాలో దేశీయంగా తయారు కాబడిన భారీ ప్రయాణికుల విమానం సీ919 మొదటిసారి ఆదివారం గాల్లోకి ఎగిరినట్టు చైనా మీడియాలు ప్రకటించాయి.
షాంఘై( Shanghai ) నుంచి బీజింగ్‌కు ప్రయాణించినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ షినూవా కూడా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది.ఉదయం సర్రిగా 10.32కు షాంఘై నుంచి బయల్దేరిన ఈ విమానం మధ్యాహ్నాం 12.31కు బీజింగ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సీ919కోసం చైనాలో ఏళ్ల తరబడి పరిశోధనలు చేసినట్టు తెలుస్తోంది.ఎట్టకేలకు మేడిన్ చైనా 2025 వ్యూహానికి ఈ విమానం మరింత బలాన్ని చేకూర్చనుందనే చెప్పుకోవచ్చు.ఈ సందర్భంగా ‘కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా’( Commercial Aircraft Corporation of China ) మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ అయినటువంటి ఝాంగ్ షియాగువాంగ్ మాట్లాడుతూ… ”మా ఈ సరికొత్త విమానం భవిష్యత్తులో మార్కెట్ పరీక్షలను తట్టుకొంటూ దూసుకుపోతుంది.” అని పేర్కన్నారు.కాగా ఈ విమానం ఏకధాటిగా 5,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని చెప్పుకొచ్చారు.

దాంతో ఎయిర్‌బస్ ఎ 320, బోయింగ్ బీ737 విమానాలకు భవిష్యత్తులో ఇది బలమైన పోటీ ఇస్తుందని చైనా బలంగా విశ్వసిస్తోంది.ఇక సాధారణంగా ఈ రకం విమానాలను దేశీయ, సమీప దేశ ప్రయాణాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు.కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా నిర్మించిన సీ919 విమానాన్ని 2022 డిసెంబర్‌లో చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు సరఫరా చేయడం జరిగింది.
ఆ తరువాత దీనికి పలు పరీక్షలు నిర్వహించగా ఇది సమర్ధవంతంగా పయనించగలదు అని తేలింది.కాగా ఈ విమానంలో బిజినెస్, ఎకానమీ క్లాస్‌లు ఉన్నాయి.164 మంది ప్రయాణించవచ్చు.ఇక ఈ విమానపు ముక్కు, రెక్కలు, ఇతర వ్యవస్థలను చైనా అభివృద్ధి చేయగా ఇంజిన్ తయారీలో మాత్రం జనరల్ ఎలక్ట్రిక్స్, ఫ్రాన్స్‌కు చెందిన ‘సాఫ్రాన్’ సాయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
