'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్ గా ఆ విలక్షణ నటుడు.. పవన్ కు పోటీ ఇవ్వగలడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.( Ustaad Bhagat Singh ) ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Parthiban Playing Villain Role In Ustaad Bhagat Singh Details, Ustaad Bhagat Sin-TeluguStop.com

పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యాడు.రెండు ఒకే సమయంలో చేస్తూ ముందుకు వెళుతున్నాడు.

ఇక ప్రజెంట్ ఉస్తాద్ షూటింగ్ లో పవన్ బిజీగా ఉన్నారు.హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగనుంది.పవన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.మాస్ ఆడియెన్స్ ను మెప్పించే హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Telugu Hiban, Harish Shankar, Pawan Kalyan, Sakshi Vaidya, Sreeleela, Tamil, Ust

ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటుల వివరాల గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.కానీ ఇందులో విలన్ గా ఎవరీ ఫిక్స్ అయ్యారు అనే విషయం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది అని తెలుస్తుంది.ఈ సినిమాలో విలన్ గా తమిళ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్ ను( R Parthiban ) తీసుకున్నట్టు టాక్.సుదీర్ఘ అనుభవం ఉన్న ఈయనను ఏరికోరి ఈ సినిమా కోసం విలన్ గా హరీష్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

Telugu Hiban, Harish Shankar, Pawan Kalyan, Sakshi Vaidya, Sreeleela, Tamil, Ust

ఈయన ఇప్పటికే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసాడు.కానీ అంతగా గుర్తింపు పొందలేదు.మరి ఈసారి హరీష్ చేతుల్లో పడ్డారు కాబట్టి ఈయన ఫేట్ మారిపోవడం ఖాయం.ఈ సినిమాలో విలన్ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందట.హరీష్ కొత్తగా ఈ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో( Sreeleela ) పాటు సాక్షి వైద్య( Sakshi Vaidya ) కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ కాంబో గబ్బర్ సింగ్ వంటి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube