ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆయన లోక్ సభలో ప్రసంగించారు.
75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
చారిత్రక విజయాలను ఎన్నింటినో మనం స్మరించుకోవాలని పేర్కొన్నారు.భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్న మోదీ ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.
చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు చెబుతున్నామని తెలిపారు.