Gurpatwant Singh Pannun : గురుపత్వంత్‌ హత్యకు కుట్ర కేసు : భారత్‌తో పనిచేస్తున్నామన్న అమెరికా అధికారులు

ఖలిస్తాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను( Gurpatwant Singh Pannun ) అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా అగ్రరాజ్యం ఆరోపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పన్నూ వ్యవహారం తెరపైకి రావడం ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారులలో ఆగ్రహానికి కారణమైంది.

 Pannuns Murder Plot Working With India To Bring Those Accountable To Justice Sa-TeluguStop.com

పన్నూన్‌ను అమెరికా( America ) గడ్డపై చంపడానికి జరిగిన కుట్ర వెనుక బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి తమ దేశం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని బైడెన్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది.అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగివున్న పన్నూన్‌ను హత్య చేయడానికి యత్నించిన కుట్రలో పాల్గొన్నందుకు గాను భారత జాతీయుడు నిఖిల్ గుప్తాపై( Nikhil Gupta ) ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గతేడాది నవంబర్‌లో అభియోగాలు మోపారు.

గుప్తా ఒక ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేస్తున్నాడని.న్యూయార్క్ నగరంలో నివసించే పన్నూన్‌ను చంపడానికి 1,00,000 డాలర్లు సుపారీ చెల్లించేందుకు అంగీకరించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.బుధవారం జరిగిన కాంగ్రెస్ విచారణ సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ.( Donald Lu ) హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు.

Telugu Biden Official, Donald Lu, Gurpatwantsingh, India, Indian, Khalistan, Nik

ఇది తీవ్రమైన సమస్య అని.భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒకరి ఆదేశాల మేరకు పన్నూన్‌ను చంపడానికి భారత జాతీయుడు (నిఖిల్) ప్రయత్నించాడని ఆరోపించారు.ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని డొనాల్డ్ లూ చెప్పారు.

ఈ భయంకరమైన నేరానికి బాధ్యులైన వారిని జవాబుదారీగా వుంచేలా తాము ప్రస్తుతం భారత్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు.ఈ అంశంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు భారత్ స్వయంగా ప్రకటించిందని, న్యాయం జరిగేలా, పారదర్శకంగా పని చేయాలని తాము న్యూఢిల్లీని కోరుతున్నామని లూ పేర్కొన్నారు.

Telugu Biden Official, Donald Lu, Gurpatwantsingh, India, Indian, Khalistan, Nik

ఇకపోతే.గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో నిఖిల్ గుప్తా ప్రస్తుతం చెక్ రిపబ్లిక్( Czech Republic ) నిర్బంధంలో వున్నాడు.పన్నూన్‌ను హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఇతనిని తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ఆ దేశాన్ని కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube