మీ పాన్ కార్డ్‌పై ఎవరైనా రుణం తీసుకున్నారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి!

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి.స్కామర్లు కొందరిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.

ఇది మీ విషయంలో జరగదని అనుకోవద్దు.చాలా సందర్భాలలో స్కామర్లు యజమానికి తెలియకుండా పాన్ కార్డ్ సహాయంతో రుణాలు తీసుకుంటుంటారు.

మీ వద్ద పాన్ కార్డ్ ఉంటే మీరు కూడా ఇలా మోసపోయే అవకాశాలు ఉండవచ్చు.ఇటువంటి అనుమానం కలిగినప్పుడు మీరు పాన్ కార్డ్‌ను ఎవరైనా ఏ విధంగా తనిఖీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం మీరు మీ CIBIL స్కోర్‌ని తనిఖీ చేయడం మొదటి సులభమైన మార్గం.మీరు దీన్ని వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు CIBIL, Equifax, Experian లేదా CRIF హై మార్క్ ద్వారా తనిఖీ చేయవచ్చు.

Advertisement

CIBIL స్కోర్‌ని తనిఖీ చేయడం ద్వారా మీ పేరు మీద మీకు ఏదైనా లోన్ ఉందోలేదో తెలుసుకోవచ్చు.ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ సహాయం తీసుకోవడం మరొక మార్గం.

మీ పాన్ కార్డ్‌పై రుణం ఉందో లేదో.మీరు Paytm లేదా పాలసీ బజార్ వంటి ఏదైనా ప్లాట్‌ఫారమ్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫారమ్‌లలో మీరు ఆర్థిక నివేదికలను తనిఖీ చేసే ఆప్షన్ ఉంటుంది.ఇక్కడ నుండి మీరు మీ CIBIL స్కోర్, లోన్ వివరాలను సులభంగా కనుగొనవచ్చు.

మూడవ మార్గం ఫారమ్ 26A తనిఖీ చేయడం.అంటే, మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారా లేదా అనేది తెలుసుకునేందుకు మీరు ఫారమ్ 26A నుండి తనిఖీ చేయవచ్చు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే వార్షిక పన్ను రిపోర్టు.ఇందులో మీ ఆదాయపు పన్ను రిటర్న్ రికార్డులు, మీ పాన్ కార్డ్ ద్వారా జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి.

Advertisement

ఈ విధంగా మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

తాజా వార్తలు