పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో ఆక్రమ మట్టతవ్వకాలు జరుపున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు( Nimmala ramanaidu ) వినూత్న రీతిలో నిరసన తెలిపారు చించినాడ గోదావరి లంక దళితుల భూమిలో దళితులకు మద్దతుగా కమ్యూనిస్టులతో కలిసి ధర్నా చేసారు .
దళితులకు భూమి పంచవలసిన ప్రభుత్వం దళితుల భూమి లాక్కోవడం దారుణమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిన దళిత వ్యతిరేకి జగన్( YS Jagan Mohan Reddy ) నేడు దళితుల భూములు లాక్కుంటున్నాడని విమర్శించారు పేదల భూమి లాక్కుంటున్న జగన్ పెద్దందార్ల తరపునా? పేదల తరపునా? ప్రజలు ఆలోచించాలని రామానాయుడు అన్నారు రక్తాన్నయినా త్యాగం చేసి దళితుల భూములు రక్షించుకుంటామంటూ దళిత భూముల్లోనే క్రింద కూర్చుని నిరసన తెలిపారు నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు
.