క్రైస్తవులు మాత్రమే పారిశుద్ద్య ఉద్యోగంకు అర్హులట

పాకిస్థాన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ప్రభుత్వం కూడా తమ వంతు భాగస్వామ్యం వహిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అక్కడ హిందువులు మరియు క్రైస్తవులు అత్యంత దారుణంగా హింసించబడుతారు.

కొన్ని ప్రాంతాల్లో హిందువులు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి ఉంది.రాత్రి సమయంలో ఎవరు దాడి చేస్తారో అంటూ హిందువులు క్రైస్తవులు భయం భయంతో జీవితం గడుపుతూ ఉంటారు.

ఇక తాజాగా పాకిస్తాన్‌లో ముస్లీమేతర జనాలపై ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నిరూపితం అయ్యింది.కరోనా సమయంలో హిందువులకు రేషన్‌ ఇచ్చేందుకు నో చెప్పిన పాక్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంతో విమర్శల పాలయ్యింది.

ఇటీవల పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్రంలో పారిశుధ్య ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వేశారు.అందులో భాగంగా ముస్లీంలు ఈ ఉద్యోగంకు అప్లై చేసుకోవద్దని, కేవలం క్రైస్తవులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు అంటూ నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది.

Advertisement

అయితే నిరుద్యోగ ముస్లీం యువకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.ఒక వైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం సాగిస్తుంటే పాక్‌ మాత్రం చాలా నీచంగా ఇప్పటికి మతం పేరుతో రాజకీయాలు చేసేందుకు చూస్తుంది.

అక్కడ పరిస్థితులు ఇంకా ఎప్పటికి మారుతాయో అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు