పాకిస్తాన్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కొత్త విషయం కాదు.ఆ దేశంలో చాలా మంది క్రికెటర్లు దేశం కోసం ఆడటం మానేసి సొంత అజెండాతో ఆడుతారు.
అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ లు చేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు.గతంలో సల్మాన్ భట్, అమీర్ లాంటి ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసి నిషేధం ఎదుర్కొన్నారు.
ఈ కారణంగానే పాకిస్తాన్ క్రికెట్ టీంకి ప్రపంచ క్రికెట్ లో గౌరవమైన స్థానం లేకుండా పోయింది.ఒకప్పుడు దేశం కోసం ఆడే ఆటగాళ్ళు కనిపిస్తే, తరువాత బుకీలకి అమ్ముడుపోయి మ్యాచ్ లు ఓడిపోవడానికి కారణం అయినవాళ్ళు టీంలోకి వచ్చారు.
ఇప్పుడు ఈ వరుసలో మరో పాకిస్తాన్ క్రికెటర్ వచ్చి చేరాడు.
మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తమ్ముడైన ఉమర్ అక్మల్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు రెండేళ్ళ నిషేధం విధించింది.
పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది.చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది.అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించపోయిన బుకీలతో సంబంధాలు ఉండటంవలనే అని తెలుస్తుంది.బోర్డు నియమావళిని అతను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
పాక్ సూపర్ లీగ్ లో అతను సందేహాస్పద ప్రవర్తనే నిషేధానికి కారణం అని కొంత మంది తెలుపుతున్నారు.ఆ సమయంలో బుకీలతో సంబంధాలు కలిగి ఉన్నాడని, కొన్ని మ్యాచ్ లలో ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు.