అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పాకిస్తాన్ ప్లేయర్ నిధాదార్ వరల్డ్ రికార్డ్..!

సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక భారత మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తుంటే, మరొకవైపు దాయాది పాకిస్తాన్ జట్టు అపజయాలతో సతమతమవుతుంది.

మొదటి మ్యాచ్ లోనే భారత్ చేతులో ఘోర ఓటమిని చవి చూసింది పాకిస్తాన్.మొదటి నుండి పాకిస్తాన్ వరుసగా ఓటములను ఖాతాలో వేసుకుంటు, కొలుకోలేక పోతునపటికి పాకిస్తాన్ ప్లేయర్స్ మాత్రం ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నందుకు, క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

పాకిస్తాన్ ఉమెన్స్ బ్యాటర్ మొన్ననే పాకిస్తాన్ తరఫున మొదటి సెంచరీ చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.

తాజాగా ఇంగ్లాండ్- పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.అయితే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసింది.ఇక భారీ లక్ష్య చేదనతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది.కానీ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పాకిస్థాన్ బౌలర్ నిధాదార్ ఖాతాలో మాత్రం వరల్డ్ రికార్డ్ పడింది.టి20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ అనూష (125) పేరిట ఉండేది.తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా నిధాదార్ 130 మ్యాచుల్లో 126 వికెట్లు తీసి క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Advertisement

ఒకపక్క పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్స్ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టించుకున్నందుకు, అభిమానుల్లో కాస్త జోష్ నెలకొంది.ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వికెట్లు తీసిన స్టార్ బౌలర్ గా నిధాదార్ తనకంటూ ఒక ప్రత్యేక రికార్డ్ సృష్టించుకుంది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు