పాకిస్తాన్ కి చెందిన నటీమణులు మోడల్స్ హనీ ట్రాప్ కి పాల్పడుతున్నారు అంటూ పాకిస్తాన్ కి చెందిన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ఆదిల్ రజా ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆ వాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అంతేకాకుండా ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా హనీ ట్రాప్ ఆరోపణలపై పాకిస్తాన్ కి చెందిన నటి సజల్ ఆలీ స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మన దేశం విలువల పరంగా అనగారిపోతోంది.
ఒకరి వ్యక్తిత్వాన్ని నాశనం చేయటమే దారుణమైన మానవత్వంగా శాపంగా మారిపోయింది అని ఆమె తెలిపింది.
అలాగే పాకిస్తాన్ కి చెందిన మరొక నటి కుబ్రాఖాన్ కూడా అదిల్ రజా పై తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఈ మేరకు తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.ఒక ఫేక్ వీడియో వల్ల నా ఉనికి ఏమాత్రం భంగం కలగలేదని నేను కూడా మొదట్లో భావించాను.
కానీ ఇక చాలు నాపై అనవసరమైన కామెంట్లు చేస్తే నేను ఊరుకుంటానని అనుకుంటున్నారా.ఆఫీసర్ ఆదిల్ రజా మీరు ఎవరి మీద అయిన కామెంట్లు చేసేముందు ఆధారాలను చూపండి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది.అసలేం జరిగింది అన్న విషయానికి వస్తే… పాకిస్తాన్ కి చెందిన మేజర్ ఆదిల్ రజా అనే వ్యక్తి పాకిస్తాన్ మిలిటరీలో పనిచేసిన రిటైర్ అయ్యారు.
ప్రస్తుతం అతను సోల్జర్స్ స్పీక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్నారు.తరచూ ఏవో ఒక వీడియోలు పోస్ట్ చేస్తుంటే అతను ఇటీవల హనీ ట్రాప్ గురించి ఒక వీడియోని విడుదల చేస్తూ పాకిస్తాన్ కి చెందిన పలువురు నటి మణులు మోడల్స్ హనీ ట్రాప్ కు పాల్పడుతున్నారని ఆ వీడియోలో తెలిపారు.అయితే వారి పూర్తి పేర్లు చెప్పకుండా ఎం.హెచ్, ఎమ్ కె, కేకే, ఎస్ ఏ అని తెలిపారు.అయితే వారందరూ మిలటరీ జనరల్ బజ్వాతో పాటు ఐఎస్ఐ హెడ్ ఫైజ్ హమీదితో కలిసి పని చేస్తున్నారు అని అతను వీడియోలు తెలిపారు.అంతేకాకుండా కొందరు నటిమణులు పొలిటీషియన్ లపై హనీ ట్రాప్ లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.