కింగ్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ మీడియా.. ఎందుకంటే..

టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా మొదటి మ్యాచ్ లోనే దయాది పాకిస్తాన్ తో అద్భుతమైన పోరాటంతో టీం ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ టీం ఇండియాను గెలిపించాడు.అయితే చివరి ఓవర్లో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా కానీ, కోహ్లీ అద్భుతంగా ఆడి టీమ్‌ ఇండియాను గెలిపించాడని పాక్‌ మీడియా సైతం కింగ్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

 Pak Media Praises Virat Kohli Innings Vs Pak In Icc T20wc Match Details, Pak Med-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే పాక్ క్రికెట్ అభిమానులు కోహ్లీ ఆట తీరుకు ఫిదా అయిపోయారు.పాక్ ప్రధాన పత్రిక ‘డాన్‌’ విరాట్‌ అని ప్రశంసిస్తూ వార్తలు రాస్తుంది.

ఓటమి అంచున ఉన్న భారత్‌ను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చిన ఘనత అతడిదే అని వెల్లడించింది.ఇక పాక్‌ బౌలర్‌ మహమ్మద్‌ నవాజ్‌ భారత్‌కు అనవసరంగా వైడ్‌, నోబాల్‌ రూపంలో అదనపు పరుగులు ఇవ్వడం వల్ల ఫలితం తారు మారైపోయింది.

పాక్‌ సెలక్షన్‌ కమిటీ లోపాలను విరాట్‌ బహిర్గతం చేశాడని మరో కథనంలో పేర్కొంది.ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేసి తప్పుచేసిందని, సయిద్‌ అజ్మల్‌ తర్వాత పాక్‌కు డెత్‌ ఓవర్లు వేసే స్పిన్నరే ఇప్పటివరకు దొరకలేదు అని విమర్శించింది.

Telugu Babar Azam, Cricket, Hardik Pandya, Icc Twc, India, India Pak, Pak, Pakis

నలుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంపిక చేసుకొని ఉండాల్సిందని తెలిపింది.నరాలు తిరిగే ఉత్కంఠ తో కూడిన మ్యాచ్ విరాట్ అండ్ పాండ్యా భారత్ ను గెలిపించిన తీరు పాక పత్రిక అయినా ది న్యూస్ లో వెల్లడించింది.పలువురు ప్రముఖులు తమ జట్టుకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఈ మ్యాచ్‌ను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గ్రేట్‌ గేమ్‌ అని ప్రశంసించారు.

ఇక 20 ఓవర్ బోలింగ్ వేసిన స్పిన్నర్ నవాజ్ లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కెప్టెన్ బాబర్, నవాజ్ నువ్వు నా మ్యాచ్ విన్నర్ వి నీపై నమ్మకం ఉంది అని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube