తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు అప్పగించారు సీఎం జగన్‌అయితే వీరిలో ఒకరు మాత్రం ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటున్నారు.ఆయనే పినిపే విశ్వరూప్‌ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన సత్తా చాటలేక పోయారనే వాదన ఉంది.
అయితే ఇప్పుడు జరుగుతున్న అమలాపురం మునిసిపాలిటీ ఎన్నికల్లో అయినా ఆయన సత్తా చాటుతారా? అనేది ప్రశ్నగా మారింది.ఆయన ఇప్పటి వరకు పెద్దగా దూకుడు చూపించలేక పోయారు.
ఎవరికి వారుగా ఉన్న నాయకులను కలిపి ముందుకు తీసుకువెళ్లడంలోనూ మంత్రి చొరవ చూపించలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఈ రోజు జరుగుతోన్న అమలాపురం మునిసిపాలిటీ ఎన్నికల్లో విజయం ఇప్పుడు మంత్రి పినిపేకి ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక్కడ వైసీపీని గట్టెక్కిస్తే పార్టీలో ఆయన హవా పెరుగుతుందని అందరూ అంటున్నారు.అయితే దీనికి తగిన విధంగా ప్రణాళిక మాత్రం మంత్రి గారు ఇప్పటి వరకు వేయలేక పోయారు.
ఇక, మరో మంత్రి చెల్లుబోయిన వేణు విషయం కూడా ఇక్కడచర్చకు వస్తోంది.ఆయన దూకుడుగానే ఉన్నారు.
అయితే టీడీపీ , జనసేనలు అంతర్గతంగా సాగిస్తున్న పొత్తుకు మాత్రం ఆయన చెక్ పెట్టలేక పోతున్నారని వైసీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం.

ఈ ఇద్దరు మంత్రుల్లోనూ అమలాపురం మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యే వారు మాత్రం పినిపే అనే అంటున్నారు పరిశీలకులు.ఆయన వివాద రహితుడే అయినా దూకుడు రాజకీయాలు చేయలేక పోవడం పార్టీని ముందుండి నడిపించలేక పోవడం వంటివి మైనస్‌గా మారుతున్నాయి.పార్టీ పరంగా ఎప్పుడూ బలమైన వాయిస్ లేకపోవడం అటు శాఖలోనూ పట్టులేకపోవడం కూడా ఆయనకు దెబ్బే.
ఈ క్రమంలో మంత్రి గారి భవితవ్యంపై ఆయన అనుచరులు బెంగపెట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు.మరో కొన్నినెలల్లోనే జగన్ మంత్రులను మార్చడం ఖాయం.ఈ నేపథ్యంలో పినిపే సీటు ఖాళీ అవుతుందని ఈ ప్లేస్‌లో పండుల కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.మరి ఇప్పటికైనా పినిపే కళ్లు తెరుస్తారా? లేదా ? చూడాలి.