ఏపీలో గత కొన్నాళ్లుగా జనసేన పార్టీ పై ప్యాకేజీ పార్టీ అనే ముద్ర వేసేందుకు వైసీపీ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నుంచి పవన్ కు ముడుపులు అందుతున్నాయని, పవన్ చంద్రబాబుకు దత్త పుత్రుడు అని.
ప్యాకేజీ స్టార్ అని ఇలా రకరకలుగా పవన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు,.అయితే ఇలాంటి వ్యాఖ్యలపై మొదట్లో చూసి చూడనట్లు వ్యవహరించిన పవన్.
ఇదిలాగే కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించి.ఇలాంటి విమర్శలు చేసే వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్.
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయినప్పటికి పవన్ పై ఇలాంటి విమర్శలు గుప్పించడం మాత్రం మానడం లేదు చాలమంది.
ఇక తాజాగా ఏబీఎన్ బాస్ రాధాకృష్ణ.పవన్ ప్యాకేజీ పై చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో అగ్గి రాజేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో కలిసి పోటీ చేసేందుకు లేదా జనసేన సింగిల్ గా పోటీ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నుంచి పవన్ కు వెయ్యికోట్ల ప్యాకేజీ అందిందని రాధాకృష్ణ తన పత్రికలోనూ, న్యూస్ చానల్ లోనూ కథనాలు ప్రసారం చేశారు.దీంతో జనసైనికులు రాధాకృష్ణపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై పవన్ ఇంతకుముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని, మళ్ళీ ఇలా ప్యాకేజీ లొల్లి తెరపైకి తీసుకురావడం ఏంటని జనసైనికులు ఏబీఎన్ రాధాకృష్ణపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనుకోవాలంటూ రాధాకృష్ణకు స్ట్రాంగ్ వర్ణిగ్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ” #ABNBrokerKrishna అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు జనసైనికులు.ఇదిలా ఉంచితే రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో జనసేన బీజేపీ మద్య పొత్తు కుదిరిందా ? అనే వాదన తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం ఏపీలో జనసేన ఫుల్ రైజింగ్ పార్టీగా దూసుకుపోతుంది.గతంతో పోలిస్తే జనసేన సంస్థాగతంగా కాస్త బలపడిందనే చెప్పాలి.దీంతో ఈసారి ఎన్నికలను కూడా పవన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితీల్లో జనసేనను బలంగా నిలిపి తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు.ఈ నేపథ్యంలో పవన్ సింగిల్ గా బరిలోకి దిగుతారా లేదా ఏదైనా పార్టీతో జట్టు కడతారా ? అనే చర్చ మొదటి నుంచి కూడా జరుగుతోంది.పవన్ కూడా పొత్తులకు సిద్దమే అనే సంకేతాలను గట్టిగానే ఇచ్చారు.

దీంతో పవన్ తో కలిసే పార్టీ ఏది అనే చర్చ మొదటినుంచి జరుగుతోంది.ఇప్పుడు జనసేనతో బిఆర్‌ఎస్ పొత్తు అనే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.అయితే తన మీడియా ప్రభావంతో లేని గాసిప్స్ ను పుట్టించే రాధాకృష్ణ.ఇప్పుడుఎందుకు బిఆర్‌ఎస్ తో జనసేన పొత్తు అంటూ కొత్త గాసిప్ ను సృస్టించారనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఇది గాసిప్ యేనా లేదా నిజమా అనేది తెలియాల్సిఉంది.







