పచ్చ కర్పూరాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతి కుటుంబం అన్నాక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటుంది.కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు.

మరికొందరు ఆరోగ్య సమస్యలు, మరికొందరు వ్యాపారాలలో నష్టం ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక సమస్యను భరిస్తూ ఉంటుంది.దీనికి కారణం మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే పచ్చ కర్పూరాన్ని మన ఇంట్లో ఉంచడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి కొంతవరకు విముక్తి పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.

పచ్చ కర్పూరం

నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా

లక్ష్మీదేవి

మన ఇంట్లోకి అడుగు పెడుతుందని భావిస్తాము.

పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందర ఒక గాజు పాత్రలో నీటిని తీసుకొని అందులో పచ్చ కర్పూరం వేయాలి.అదే నీటిలో కొద్దిగా పసుపు కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి.

Advertisement
Pacha Karpuram Camphor Amazing Benefits And Uses,pacha Karpuram, Amazing Benefit

ఈ నీటిని గత రెండు రోజులకు ఒకసారి మారుస్తూ అదే విధంగా చేయాలి.ఈ విధంగా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు మన కుటుంబానికి కలుగుతాయి.

Pacha Karpuram Camphor Amazing Benefits And Uses,pacha Karpuram, Amazing Benefit

సిరిసంపదలకు మూలకారకుడయిన కుబేరుడు మూలస్థానంలో ఒక పసుపు పచ్చని వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూటకట్టి కుబేరుని స్థానంలో ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాక ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు.ఈ పచ్చ కర్పూరాన్ని ఇంటి ముఖ ద్వారానికి కట్టడం ద్వారా మన ఇంటి పై ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణాన్ని తొలగించడమే కాకుండా, ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు.పచ్చ కర్పూరం శ్రీ మహాలక్ష్మి ఫోటో కి ఎదురుగా కానీ లేదా ప్రతిమకు ఎదురుగా ఒక గిన్నెలో వేసి ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

వ్యాపారాలు చేసేవారు పచ్చ కర్పూరాన్ని లాకర్ లో ఉంచడం వారి వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు