ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు…ప్రతి గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించి అక్కడున్న ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.మూడు సంవత్సరాల కిందట ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.
ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించారని, అలాగే ప్రతి ఎమ్మెల్యే కు రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించారని, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని సిఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు…రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 6 నుంచి 8 నెలల్లో 5000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి అమర్నాథ్ చెప్పారు
కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అమర్నాథ్ ప్రజలను కోరారు.సంక్షేమ పథకాలతో సంతోషంగా వున్న తాము జగన్మోహనరెడ్డినే వచ్చే ఎన్నికల్లో గెలిపించు కుoటామని ప్రజలు భరోసా ఇచ్చారు…ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడే 27 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను మంత్రి ప్రారంభించారు…