మోడీ పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు: ఖర్గే

నూతన పార్లమెంట్ భవనం( New Parliament ) ప్రారంభోత్సవం పై మొదలైన రగడ రోజురోజుకీ ముదురుతుంది .

తన నిరంకుశ విదానాలతో ప్రజాస్వామ్య విధానాలను అపహస్యం చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న పార్టీల సంఖ్య రోజుకి పెరుగుతుంది గురువారం నాటికి 20 పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి .ప్రధాని మోదీ( PM Modi ) పార్లమెంటరీ వ్యవస్థకు ఇవ్వాల్సిన సముచిత గౌరవ ఇవ్వకుండా పార్లమెంటరీ వ్యవస్థ విలువలను ద్వంశం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున్ ఖర్గే.( Mallikarjun Kharge ) పార్లమెంట్ అన్నది ప్రజాస్వామ్యం యొక్క దేవాలయం అని.రాష్ట్రపతి కూడా అందులో భాగమని అలాంటప్పుడు ఆయనను పిలవకుండా దేశ ప్రజలకు ప్రధాని ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.సిపిఎం నేత సీతారామ ఏచూరి కూడా ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్లమెంటరీ వ్యవస్థకు అధిపతి రాష్ట్రపతి మాత్రమే ప్రధాని కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే అధిపతి అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమానికి రాష్ట్రపతిని పిలవకుండా ఉండటం కేవలం అహంకారపూరత చర్య లాగానే కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ప్రతిపక్షాల నిర్ణయం పై భాజాపా వైపు నుంచి కూడా సెటైర్లు పడుతున్నాయి ఒకప్పుడు చతిస్గడ్ అసెంబ్లీ భవనానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.తెలంగాణ గవర్నర్ తమిళ్ సాయి కూడా ప్రతిపక్షాలకు గట్టిగా రిటార్టిచ్చారు తెలంగాణ సెక్రటేరియట్ భవనానికి ఒక గవర్నర్ అయిన తనకు ఆహ్వానం లేకుండా జరిగిన విషయాల్ని అందరూ మర్చిపోతున్నారని ,కొన్ని పార్టీలురాజకీయాన్ని

ఒక ఆటలాగా మార్చేశాయని వారికి కావలసిన విధంగా నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారంటూ ఆమె మండిపడ్డారు.రోజురోజుకు ప్రారంభోత్సవం బహిష్కరిస్తున్న పార్టీల సంఖ్య పెరిగిపోవటంతో అసలు ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరవుతాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది .ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్తున్నామని బహిరంగంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తానని చెప్పింది.మిగిలిన దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఈ ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగానే ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు