కేసీఆర్ పై ప్రతిపక్షాల ముప్పేట దాడి... ఇక రణరంగమేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం అనేది నెలకొంది.

 Opposition S Serious Attack On Kcr Is It A Battlefield , Telangana Politics, B-TeluguStop.com

అయితే కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దింపాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఉద్యోగాల ప్రకటన తరువాత కొంత ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తాయని భావించినా కానీ పూర్తి విమర్శనాత్మక రీతిలో వ్యవహరించారు.

ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో రాజకీయం రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది.అయితే రానున్న రోజుల్లో కెసీఆర్ ను పూర్తిగా బలహీన పరిచే దిశగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యూహ రచన చేస్తున్నాయి.

అయితే ఎంత మేరకు ప్రతిపక్షాలు కెసీఆర్ ను అడ్డుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది.

ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలమంతా ప్రతి ఒక్క పార్టీకి అగ్ని పరీక్షగా మారుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావడానికి పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.

కెసీఆర్ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ముప్పేట దాడిని ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.అంతే కాక బీజేపీ యూపీలో ప్రయోగించిన బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్దంగా ఉండటం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచి కొంత ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఎంత మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ వ్యూహాలను విజయవంతంగా ప్రయోగించిన పరిస్థితిలో మనకు కాస్త అవగహనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.మరి రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయనేది చూడాల్సి ఉంది.

అంతేకాక ప్రస్తుతం ప్రజలను ప్రతిపక్షాలు ఎంత మేరకు ఆకట్టుకోగలుగుతున్నారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube