ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రాలలో ఒకటి తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో( Leo ) లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా పై తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా సమానమైన క్రేజ్ మరియు హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు సూపర్ హిట్ రేంజ్ లో వసూళ్లను రాబట్టి 610 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.మొదటి రోజు ఆ చిత్రానికి దాదాపుగా 147 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ రికార్డు ని ‘సలార్‘ చిత్రం అవలీలగా బ్రేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేసారు.ఎందుకంటే ఆదిపురుష్ చిత్రం మొదటి రోజు దాదాపుగా 150 కోట్ల రూపాయిలు చేసింది.

కానీ ‘సలార్( Salaar )’ చిత్రం లియో రికార్డ్స్ ని బద్దలు కొట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే వచ్చే అవకాశం ఉంది.ఇక తమిళ నాడు లో ఈ చిత్రానికి 5 కోట్లకు మించి గ్రాస్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.కేరళ లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్, కర్ణాటక లో 11 కోట్ల రూపాయిల గ్రాస్, హిందీ వెర్షన్ కి 20 కోట్ల రూపాయిల గ్రాస్, మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.మొత్తం కలుపుకుంటే 130 నుండి 140 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

అంటే లియో ఓపెనింగ్స్ కి దూరంగా వసూళ్లు ఆగాయి అన్నమాట.ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్(Prashanth Neel ) లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఇమేజి ఉన్నవాళ్లు కలిసినా కూడా లియో రికార్డ్స్ ని కొట్టలేదంటే విజయ్( Vijay ) స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు.లియో చిత్రానికి సలార్ కి వచ్చినంత పాజిటివ్ టాక్ మొదటి రోజు రాలేదు.అయినా కూడా ఇంకా టాప్ లో ఉందంటే మెచ్చుకోదగ్గ విషయమే.ఫుల్ రన్ లో అయినా సలార్ లియో రికార్డ్స్ ని కొడుతుందో లేదో చూడాలి.