ఆ కుటుంబంలో ఒకళ్లా.. ఇద్దరా.. ఏకంగా ఐదుగురు కలెక్టర్లు..!

ఆస్థి, ఐశ్వర్యం, డబ్బులు, నగలు వీటన్నిటిని ఎవరన్నా దొంగతనం చేయవచ్చు కానీ.చదువును మాత్రం ఎవరు దొంగతనం చేయలేరు.

మనిషి బతికి ఉన్నంత కాలం మనం చదివిన చదువు మనతోనే ఉంటుంది.చదువు జ్ఞానాన్ని, తెలివి తేటలను పెంచుకుంది.

సమాజంలో పేరు, ప్రతిష్టలను కూడా మనకి ఇస్తుంది.అందుకే ప్రతి ఒక్క తల్లితండ్రులు తాము చదువుకోకపోయినా తమ పిల్లలు గొప్ప చదువులు చదుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు.

ఈ క్రమంలోనే మీకు ఒక గొప్ప తండ్రి, కూతుళ్ళ గురించి చెప్పాలి.రాజస్తాన్‌ లోని హనుమాఘర్‌ లో నివాసం ఉంటున్న శ్రీ సహదేవ్‌ సహరన్‌ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణ రైతు.

Advertisement

పెళ్లి అయిన తర్వాత ఆ దంపతులకు వరసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు.అయినాగానీ కొడుకులు లేరని బాధ పడకుండా, ఆడపిల్లలు బరువు అని భావించకుండా అందరిని చదివించాడు.

సహదేవ్ కు చిన్నపటి నుంచి ఐఏఎస్‌ కావాలని కోరిక అంట.కానీ ఆయన ఆర్ధిక పరిస్థితులు బాగోలేక రైతుగానే ఉండిపోయాడు.కూతుళ్లు ద్వారా అయిన తన కల నెరవేర్చుకోవాలని భావించి వారందరిని కష్టపడి చదివించాడు.

సహదేవ్ ఆశించినట్లే ఆ ఐదుగురు ఆడపిల్లలు కూడా చదువుల తల్లి ముద్దు బిడ్డలయ్యారు.ఏకంగా ఐదుగురు కూడా కలెక్టర్లు అయ్యారు.అసలు ఐఏఎస్ పాస్ అవ్వడం అంటే మాములు విషయం కాదు.

ఒక ఇంట్లో నుంచి ఒకరిని లేదంటే ఇద్దరిని కలెక్టర్‌ గా ఎంపికవడం మనం వినే ఉంటాము.కానీ.సహరన్‌ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికయ్యి అందరికి ఆదర్శంగా నిలిచారు.2018లో నిర్వహించిన రాజస్తాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా అందులో హనుమఘర్‌ కు చెందిన అన్షు, రీతు, సుమన్‌ లు ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ కు (ఆర్‌ఏఎస్‌) ఏకకాలంలో ఎంపికై అందరిని ఆశ్చర్యంలో ముంచేశారు.వీరికంటే ముందే వీళ్ళ అక్కలు అయిన రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఏఎస్‌ కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు ఐదుగురు ఆడవాళ్లు కలెక్టర్లుగా ఉండడం విశేషం అనే చెప్పాలి.ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ ఆర్‌ఏఎస్‌ కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్‌ చేస్తూ ట్విటర్‌ లో ఈ విధంగా స్పందించారు.

Advertisement

ఇది నిజంగానే మనం అందరం గర్వించదగిన విషయం.అన్షు, రీతు, సుమన్‌ లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌ కు ఎంపికవడం చాలా గొప్ప విషయం.ఈ ముగ్గురు కూతుళ్ళ విజయంతో వారి తండ్రికి, అలాగే వారి కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది అంటూ కామెంట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు ఈ అక్కాచెల్లెళ్లు గురించి సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.

తాజా వార్తలు