భారీ జాక్ పాట్ : రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిన భారతీయుడు...!!!

అదృష్టం ఎప్పుడూ చెప్పిరాడు, ఎప్పుడు, ఏ రూపంలో మనల్ని వరిస్తుందో కూడా తెలియదు.

అందుకే ఊహించని విధంగా అదృష్టం కలిసొచ్చిన వారిని నక్క తోక తొక్కాడు అంటుంటారు.

ఇదే కోవలో తాజాగా ఓ భారతీయుడు దేశం కాని దేశంలో నక్క తోక తొక్కాడు అలా యిలా కాదు.ఇక జీవితంలో పూర్తిగా స్థిరపదినట్టేనట.

ఒక్క సారిగా వచ్చిపడిన ఈ సంపదను చూసి మనవాడు ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు.ఇంతకీ అతడు ఎవరు, ఏం చేస్తాడు, లాటరీలో అతడికి ఎంత జాక్ పాట్ కలిగింది అనే వివరాలోకి వెళ్తే.

మహారాష్ట్ర లలోని ధానే కు చెందిన గణేష్ షిండే ఉద్యోగ నిమ్మిత్తం దుబాయ్ వెళ్ళారు.ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఉద్యోగం సాధించిన ఆయన దుబాయ్ లో షిప్ లలో పనిచేస్తూ కుటుంభాన్ని పోషించుకున్తున్నారు.

Advertisement

అయతే షిండే కు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం అలావాటుగా మారింది.ఎప్పటికైనా అదృష్టం వరించకపోదా అన్నట్టుగా షిండే దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో టికెట్టు నెంబర్ – 0207 అనే టిక్కెట్టు కొనుగోలు చేసారు.

ఊహించని విధంగా ఇదే టిక్కెట్టు కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ తగిలింది.దాంతో షిండే షాక్ అయ్యారు.

దుబాయ్ ఫ్రీ రాఫెల్ లాటరీలో గణేష్ షిండే కు అక్షరాలా రూ.7.45 కోట్లు.తనకు వచ్చి పడిన ఈ సంపదపై స్పందించిన గణేష్, జీవితంలో ఈ రోజును తాను మరిచిపోలేనని ఎన్నో ఏళ్ళుగా తాను లాటరీల ద్వారా తన అదృష్టం పరీక్షించుకుంటూ ఉన్నాయని ఇన్నేళ్ళకు తనను వరించిందని, ఈ మొత్తం సంపద లో కొంత సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తానని, మిగిలిన సొమ్ము కుటుంభం కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు.

లాటరీ నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు గణేష్ షిండే కృతజ్ఞతలు తెలిపారు.ఇక్కడ మరొక విషయం ఏంటంటే.సదరు లాటరీ సంస్థ ప్రారంభించిన నాటి నుంచీ నేటి వరకూ టిక్కెట్టు గెలుచుకున్న వారిలో భారతీయులు అత్యదికంగా ఉండటం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు