కన్నడ భామ రష్మిక( Rashmika Mandanna ) సడెన్ గా టాలీవుడ్ లో అవకాశాలు లేక ఖాళీ అయిపోయింది.తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న టైంలో బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాగా అక్కడ మూడు సినిమాలు చేసింది రష్మిక.
సౌత్ సినిమాల కన్నా హిందీ సినిమాలే బెటర్ అనే రేంజ్ లో అమ్మడు అక్కడ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.అయితే అక్కడ రష్మికకు లక్ కలిసి రాలేదు.
చేసిన సినిమాలేవి అంతగా సక్సెస్ అవలేదు.అందుకే మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది రష్మిక.
అయితే ఆమె రాగానే ఇక్కడ ఛాన్స్ లు ఎలా వస్తాయి.

ప్రస్తుతం నితిన్( Nithin ) వెంకీ కుడుముల( Venky Kudumula ) కాంబినేషన్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఒక్క సినిమా మాత్రమే రష్మిక చేస్తుంది.మరో తెలుగు సినిమా ఇప్పటివరకు అయితే సైన్ చేయలేదు.విజయ్ దేవరకొండ సినిమాలో రష్మికని చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.కానీ వారిద్దరు మాత్రం కలిసి పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు.మరి ఇలానే ఉంటే రష్మిక టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.మరి రష్మిక నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.







