కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.అయితే ఇవి కేవలం ప్రాథమిక చర్చలేనన్న ఆయన తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామని పేర్కొన్నారు.
ఇక తమని తాము త్యాగం చేసుకోలేమని చెప్పారు.ఈ మేరకు తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని వెల్లడించారు.
తమ ప్రతిపాదనలను ఆమోదిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు తాము ఎవరితోనైనా కలుస్తామని తెలిపారు.
సీపీఐ, సీపీఎం కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు.







