వలస కార్మికులకు పరిష్కారం కోసం లేబర్‌ హెల్త్‌ డెస్క్‌ ఓ అవకాశంగా భావిస్తోన్న ఒన్‌ పాయింట్‌ ఒన్‌

వలసకార్మికుల కోసం లేబర్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసిన సుప్రీంకోర్టు ముంబై, జూలై 04 2022 : బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం)లో సుప్రసిద్ధ సంస్ధ ఒన్‌ పాయింట్‌ ఒన్‌ సొల్యూషన్స్‌ ఇప్పుడు వలస కార్మికుల సంక్షేమానికి లేబర్‌ హెల్ప్‌ డెస్క్‌ ఓ పరిష్కారంగా చూస్తోంది.ఈ లేబర్‌ హెల్ప్‌ డెస్క్‌, సుప్రీంకోర్టు తీర్పుకు ప్రత్యక్ష స్పందన.

 One Point One Solutions Sees Labour Help Desk A Solution For Migrant Workers ,-TeluguStop.com

ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలను, వలస కార్మికులను కలుసుకోవడంతో పాటుగా మహమ్మారి అనంతర సంక్షోభంలో వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సహాయపడడంతో పాటుగా సంపూర్ణ సహకారం, మార్గనిర్దేశకత్వం అందించాలని ఆదేశించింది.కోవిడ్‌ –19 మహమ్మారి సమయంలో వలసకార్మికుల సమస్యలు మరియు కష్టాల ను చూసి సుప్రీంకోర్టు తన సుమోటు పిటీషన్‌కనుగుణంగా ఈ తీర్పును వెలువరించింది.

ఔట్‌బౌండ్‌ సేవలు (వాయిస్‌ మరియు నాన్‌ వాయిస్‌), ఇన్‌బౌండ్‌ సేవలు, ఎస్‌ఎంఎస్‌ , వాట్సాప్‌, ఐవీఆర్‌ సెల్ఫ్‌ సర్వీస్‌ వంటి సేవలను అందించే కాల్‌ సెంటర్‌ భాగస్వామిని గుర్తించడం మరియు నియమించడం కోసం తమ లాంటి బాహ్య ఏజెన్సీల ఆవశ్యకతను సుప్రీంకోర్టు తీర్పు తప్పని సరి చేసింది.

ఔట్‌బౌండ్‌ కాలింగ్‌ కింద కాల్స్‌ను వలసకార్మికులకు చేయడంతో పాటుగా అందుబాటులోని పలు పథకాలను గురించి వారికి వెల్లడించడం, పథకాలకు సంబంధించి ఇన్‌బౌండ్‌ కాల్స్‌కు సమాధానాలు చెప్పడం చేయాల్సి ఉంటుంది.

ఎస్‌ఎంఎస్‌బ్రాడ్‌కాస్ట్స్‌ కింద బల్క్‌ మెసేజింగ్‌ను పంపడంతో పాటుగా హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌ (1800) గురించి వలస కార్మికులకు సమాచారం అందించడం, ఐవీఆర్‌ సెల్ఫ్‌సర్వీస్‌, కస్టమైజబల్‌ పరిష్కారాలను అందించడం ద్వారా వలస కార్మికులకు పథకాలకు సంబంధించిన సమాచారం అందించడం చేస్తారు.ఒన్‌ పాయింట్‌ ఒన్‌ సొల్యూషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అక్షయ్‌ చాబ్రా మాట్లాడుతూ ‘‘సుప్రీంకోర్టు తీర్చు వలస కార్మికుల హక్కులను మరీ ముఖ్యంగా కోవిడ్‌–19 సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడిన కార్మికుల హక్కులను కాపాడింది.

వారి సంక్షేమం మరియు పరిశ్రమ కార్యకలాపాలు మెరుగ్గా సాగేందుకు ఇది ఓ ముందడుగుగా నిలిచింది.ఈ హెల్ప్‌ డెస్క్‌ వల్ల వలస కార్మికులందరూ నమోదు చేసుకోవడం సాధ్యమవుతుంది.

తద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం సాధ్యమవుతుంది.అర్హత కలిగిన వ్యక్తులు ఈ పథకాలతో ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube