చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అంతకు మించిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ మొదలు పెట్టిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ మరియు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.గత కొన్ని రోజులుగా చిత్రీకరణ సాఫీగా సాగక పోవడంతో భారీ నష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందుతుంది.
బ్రిటీష్ వారికి ఉయ్యాలవాడ వారి సైన్యంకు భారీ ఎత్తున యుద్ద సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి.ఆ యుద్ద సన్నివేశాల చిత్రీకరణను ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతం అయిన కోకాపేటలో చేస్తున్నారు.
గత వారం రోజులుగా వర్షం కురుస్తున్న కారణంగా షూటింగ్ జరపడం వీలు పడటం లేదు.పూర్తిగా ఔట్‌డోర్ షూటింగ్ అవ్వడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఇప్పటి వరకు యుద్దంకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ ప్రారంభం కాకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజులుగా ప్రతి రోజు షూటింగ్ కోసం వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు రావడం, టెక్నీషియన్స్ రావడం జరుగుతుంది.కాని షూటింగ్ మాత్రం జరగడం లేదు.దాంతో వారం రోజుల పాటు టెక్నీషియన్స్‌కు మరియు జూనియర్ ఆర్టిస్టులకు భారీ ఎత్తున ఇస్తున్న పారితోషికాలు వృదా అవుతున్నాయి.
రోజుకు లక్షల చొప్పున వృదా అవుతున్నట్లుగా ప్రొడక్షన్ యూనిట్ చెబుతున్నారు.వారం రోజుల్లో ఏకంగా కోటి రూపాయల వరకు చిత్ర యూనిట్ సభ్యులు అనవసరంగా వృదా చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు ఏదో ఒక అడ్డు రావడం జరుగుతుందని, ఇలాగే జరిగితే చిత్రీకరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
ఇక ఈ చిత్రంను వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.500 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం ఇంకా పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.బాహుబలి తర్వాత స్థానం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.







