ప్రకాశం జిల్లా అధికార పార్టీ వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఒంగోలులో ఏర్పాటు చేసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు.
ఒకే ఫ్లెక్సీలో వైవి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలు ఉండటంతో ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి శుభాకాంక్షలతో సుబ్బారెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పోరేషన్ సిబ్బంది తొలగించారు.దీంతో వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా .2014 ఎన్నికల సమయం నుంచి బావబావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్న విషయం తెలిసిందే.







