Nainital Bank : ఆ బ్యాంకు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు అదిరే గిఫ్ట్ ఇస్తోంది!

ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి ‘నైనిటాల్ బ్యాంక్‘ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది.ఈ బ్యాంక్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లను విద్దేశించి 3 కీలక నిర్ణయాలు తీసుంది.

 On The Occasion Of Completing 100 Years Of That Bank, The Same Gift Is Being Giv-TeluguStop.com

ఈ తాజా నిర్ణయాలతో బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.నైనిటాల్ బ్యాంక్ 1922లో ఏర్పాటైన విషయం తెలిసినదే.

కాగా సదరు బ్యాంక్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది.అయితే ఇక్కడ కూడా కొన్ని నియమనిబంధనలు వున్నాయి.

అవేమంటే రూ.2 కోట్లలోపు FDలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.కాగా నవంబర్ 21 నుంచే కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.వడ్డీ రేట్ల సవరణ నేపథ్యంలో బ్యాంక్ తన కస్టమర్లకు ఇప్పుడు 3.25% నుంచి 5.35% వరకు వడ్డీని అందిస్తోంది.7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు అందులో దాచుకోవచ్చు.టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు కూడా మారతాయి.

అంతేకాకుండా బ్యాంక్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.అదేమంటే ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకువచ్చింది.

Telugu Bank Customers, Bumper, Fixed Deposit, Nainishatabdi, Bank-Latest News -

ఈ క్రమంలో నైని శతాబ్ది ప్లస్ డిపాజిట్ పథకాన్ని ఆవిష్కరించింది.దీని టెన్యూర్ 700 రోజులు మాత్రమే.నైనిటాల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను గమనిస్తే.7 రోజుల నుంచి 45 రోజుల FDలపై 3.25%, 46 రోజుల నుంచి 179 రోజుల FDపై 4.25%, 180 రోజుల నుంచి 270 రోజుల FDలపై వడ్డీ రేటు 4.95% ఉంది.ఇక 270 రోజుల నుంచి ఏడాదిలోపు FD అయితే 5.05% వడ్డీ వస్తుంది.అలాగే ఏడాది నుంచి 18 నెలల టెన్యూర్2పై అయితే 5.75% వడ్డీ వస్తుంది.ఇక నైని సెంచనరీ డిపాజిట్ స్కీమ్ 625 రోజుల FDలపై అయితే 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.కాబట్టి కస్టమర్లు ఈ విషయాలు గమనించగలరని మనవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube