యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంకులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం తప్పింది.డీజిల్ పోసుకోవడాని వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమై బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పిల్చుకున్నారు.ఈ ఘటన బంక్ సీసీ టీవీలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది.







