స్కిల్ స్కామ్ కేసు లో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు( Chandrababu )ఆరోగ్య కారణాల రీత్యా నెల రోజులు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు.అయితే ఆయన విడుదల తర్వాత జరిగిన ర్యాలీ ఇప్పుడు అదికార ప్రతిపక్షాల మద్య మాటల తూటాలకు కారణమైంది .
ఆయన విడుదలైన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి హైదరాబాదులో ఉన్న నివాసానికి వెళ్లడానికి 14 గంటలు సమయం పట్టడం, దారి పొడవునా ప్రజలు,కార్యకర్తలు భారీ ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రోడ్ల మీదకు రావడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కావడం తెలిసిందే .

ఇదంతా తమ అధినేత పై ప్రజలకు ఉన్న అభిమానమేనని ఇప్పటికైనా అధికార పార్టీ ఈ జన సునామీ చూసి బుద్ది తెచ్చుకోవలంటూ టిడిపి నేతలు పయ్యావుల కేశవ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు(
Acham naidu ) వ్యాఖ్యానించడం తో దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి ( Sajjala Rama Krishna Reddy )కౌంటర్ ఇచ్చారు .హైదరాబాదు లాంటి భారీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలలో రూట్ మ్యాప్ ప్లాన్ చేసి ప్రజలు పోటెత్తారని ప్రకటించుకోవడం సిగ్గుచేటని అయినా అనారోగ్య కారణాలతో బెయిల్ తీసుకొని 14 గంటల పాటు ఎవరైనా కారులో ఎలా కూర్చుంటారని ఇది కేవలం తమకు ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవడానికి తెలుగుదేశం వేసిన ఎత్తుగడ మాత్రమేనని ఇలాంటి విధానాలను ప్రజలు అసహ్యించుకుంటారంటూ సజ్జలు చెప్పుకొచ్చారు .

అంతేకాకుండా కోర్టు ఏ ఉద్దేశంతో బెయిల్ ఇచ్చిందో ఆ నిబంధనలను టిడిపి మీరిందని, ఎటువంటి రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొనకూడదని కోర్టు స్పష్టంగా ఆదేశించినా దీనిని ఒక రాజకీయ ర్యాలీలా మార్చేసారని ఆయన ఆరోపించారు.అయితే తాము నిబంధనలకనుగునంగానే నడుచుకున్నామని రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు నివాసం వరకూ కూడా ఎక్కడా బాబు రాజకీయపరమైన వ్యాఖ్యలు గాని కనీసం వాహనంలో నుంచి బయటకు కూడా రాలేదని బాబును చూడడానికి ప్రజలే అలా వెల్లువలా పోటెత్తారు తప్ప తాము కోర్టు ఆంక్షలు మీరలేదని తెలుగుదేశం నేతలు సమర్థించుకుంటున్నారు.