మ్యూజిక్‌ ఫెస్ట్‌లకు మంచి రెస్పాన్స్‌, విజయ్‌ దేవరకొండ ఐడియాతో కామ్రేడ్‌కు మస్త్‌ పబ్లిసిటీ  

Music Fest Idia Work Outs For Vijay Devarakonda-

విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో సినిమాను వినూత్నంగా పబ్లిసిటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తన ప్రతి సినిమాకు కూడా తానే పబ్లిసిటీని విభిన్నంగా చేసుకునే విజయ్‌ దేవరకొండ ఈసారి కూడా మరింత విభిన్నంగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రంకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు.ఈయన ప్లాన్‌కు సినీ జనాలు ఇంప్రెస్‌ అయ్యారు...

Music Fest Idia Work Outs For Vijay Devarakonda--Music Fest Idia Work Outs For Vijay Devarakonda-

తెలుగుతో పాటు సౌత్‌లో ఉన్న మరో మూడు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.దాంతో అయిదు రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడిగా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు.దాంతో పాటు అయిదు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించాలని నిర్ణయించాడు.ఈ నిర్ణయంకు అనూహ్య స్పందన దక్కింది.

తమ నగరంలో ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని, తమ పక్కన నగరాల్లో అయినా జరగితే వెళ్లాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Music Fest Idia Work Outs For Vijay Devarakonda--Music Fest Idia Work Outs For Vijay Devarakonda-

బెంగళూరులో జరిగిన మ్యూజిక్‌ ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా యష్‌ హాజరు అయ్యాడు.ఇలా వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక స్పెషల్‌ను సర్‌ ప్రైజ్‌ చేస్తూ ఉంటారట.డియర్‌ కామ్రేడ్‌కు మ్యూజిక్‌ ఫెస్ట్‌లతో అనూహ్యంగా స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో పబ్లిసిటీ కల్పించాలని భావిస్తున్నారు.

అందుకోసం విజయ్‌ దేవరకొండ చేస్తున్న ప్రయత్నం సఫలం అయ్యేలాగే ఉంది.నాలుగు భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబడితే విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోల రికార్డులను కూడా బ్రేక్‌ చేసినట్లు కాబోతుంది.ఈ చిత్రంలో రష్మిక మందన్న నటించడంతో పాటు వీరిద్దరి మద్య ముద్దు సీన్స్‌ హద్దు లేకుండా ఉన్నాయి...

కనుక కలెక్షన్స్‌ కూడా హద్దు లేకుండా వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.