మీరొస్తే మాకు ఇబ్బందే ! వైసీపీలో సీన్ రివర్స్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంచి హుషారు కనిపిస్తోంది.

మొన్నటివరకు నిస్తేజంగా ఉన్నట్టు కనిపించిన ఆ పాటీలోకి అధికార పార్టీ టిడిపి నుంచి పెద్ద ఎత్తున నాయకులు కొంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీలో చేరిపోతుండడం హుషారు కలిగిస్తోంది.

ఇంకా అనేక మంది చేరేందుకు సిద్ధం అంటూ రాయబారాలు నడుపుతున్నారు.భవిష్యత్తులో వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో వీరంతా ముందస్తుగా చేరుతున్నారంటూ వైసిపి నాయకులు భావిస్తున్నారు.

వీరి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తమకు మంచిరోజులు వచ్చాయని భావిస్తుండగానే .పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు నాయకులు చేరికను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వైసీపీలోనే కొత్తగా వచ్చిన నాయకుల వల్ల భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని .వారు చేరడం వలన తమ హావ తగ్గుతుందనే భయంతో నాయకులు ఈ విధంగా చేస్తున్నట్టు జగన్ కు అనేక ఫిర్యాదులు అందాయి.పార్టీలోకి వస్తానన్న నాయకులందరినీ చేర్చేసుకోవడం కంటే తమకు ఎవరు పనికి వస్తారు.? ఎవరి అవసరం ఎక్కువ ఉంటుంది.? వంటి విషయాలను సరి చూసుకుని వారిని పార్టీలో చేర్చుకోవాలని అధినేత కే సలహాలు సూచనలు ఇస్తూ లేఖలు పంపుతున్నారు.అయితే ఈ వ్యవహారం మరింత ముదరడంతో జగన్ కూడా ఈ విషయం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చూస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం పర్యటనలో ఉన్న జగన్ పర్యటన ముగిసిన అనంతరం వైసీపీలో చేరే నాయకుల విషయంపై పార్టీ లో ఉన్న కీలక నాయకులతో చర్చించి.ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.ప్రస్తుతం టీడీపీ నాయకులే కాకుండా.

కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.మారుతున్న ఈ పరిణామాలే వైసీపీ నాయకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

అయితే ఈ విషయంలో ఎటు వంటి కంగారు అవసరం లేదని.కొత్తగా చేరిన నాయకుల వలన ఎవరి ప్రేయార్టీ తగ్గదని.

ఎవరి గుర్తింపు వారికి ఉంటుందని మరికొంతమంది అసంతృప్తులకు సర్దిచెప్పుతున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు