ఒకే కాన్పులో 10 మంది సంతానం.. అబద్ధమేనా..!? అసలు నిజం ఇదే..!

ఇటీవల దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో పదిమందికి జన్మించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే తాజాగా ఈ కథనానికి సంబంధించి మరో నిజం వెలుగులోకి వచ్చింది ఏమిటంటే.

పది మంది సంతానం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేకపోవడం చర్చనీయమైన అంశం అయ్యేంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాకు చెందిన గుటెంగ్ ప్రావియన్స్ కు చెందిన 37 ఏండ్ల గొసైమ్ మహిళ జూన్ 07వ తేదీన పెట్రోరియా లోని ఓ ఆసుపత్రిలో ఒకే కాన్పులో పదిమందికి జన్మనిచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది.

ఆ సమయంలో ఆ మహిళ మాట్లాడుతూ ఎనిమిది మంది పుడతారు అని అనుకుంటే ఏకంగా పది మంది జన్మించారు ఇదొక వరల్డ్ రికార్డ్ అని తెలిపింది.ఇది ఇలా ఉండగా తాజాగా గొసైమ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు.

ఈ క్రమంలో భాగంగానే గొసైమ్ ను జోహన్స్ బర్గ్ లోని ఆమె బంధువుల నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే 10 మంది సంతానం విషయంలో అసలు విషయం బయట పెట్టేందుకు సామాజిక కార్యకర్తల సహాయంతో తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో చేర్చారు.

Advertisement

ఇందులో భాగంగా ఆమె సంతానానికి జ‌న్మ‌నిచ్చ‌న క‌థ‌ను ప్ర‌చారంలో పెట్టి న‌వ‌జాత శిశువుల‌కు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తూ మిలియ‌నీర్ కావాల‌ని త‌న భ‌ర్త ప్లాన్ చేసిన‌ట్టు ఇలా తెలిపింది.అంతేకాకుండా 10 మంది శిశువులు పుట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ కూడా స్పష్టంగా తెలియజేసింది.అయితే మరోవైపు ఆమెను విడుదల చేయాలని గొసైమ్ తరపున న్యాయవాది రెఫెలో తెలియజేశారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు