భయానకం.. బీభత్సం: యజమానిని చంపి పీక్కుతున్న కుక్కలు

ఒహియోలో దారుణం జరిగింది.పెంపుడు కుక్కల చేతుల్లోనే ఓ మహిళ దారుణంగా చంపబడింది.

ఓవర్‌డోస్ విషయంగా వేన్స్‌విల్లేలోని వాటర్‌వే డ్రైవ్ 7000 బ్లాక్‌లోని కొందరు స్థానికులు క్లియర్‌క్రీక్ టౌన్‌షిప్ పోలీసులకు శుక్రవారం మధ్యాహ్నం 2.24 గంటల ప్రాంతంలో సమాచారం అందించారు.అక్కడ 49 ఏళ్ల మాథ్యూస్‌‌ ఇంటి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు.

లోపలి వాతావరణం వారికి అనుమానాస్పదంగా కనిపించింది.పై అంతస్తులో ఉన్న బాత్‌రూమ్ నుంచి రక్తం ధారగా కిందకు వస్తోంది.పైకి వెళ్లి చూడగా మాథ్యూస్ స్పృహ తప్పి పడివుండటంతో పాటు అర్థనగ్నంగా, శరీరం నిండా కొరికిన గుర్తులున్నాయి.

ఆధారాల కోసం తనిఖీ చేయగా.ఇంటి గోడలు, కిటికీలతో పాటు వాషింగ్ మెషిన్, డ్రయర్‌లపై రక్తం నిండివుంది.

అలాగే మాథ్యూస్ ఎడమ చీలమండ ప్రాంతం వద్ద మాంసపు కండ కనిపించలేదు.ఘటనాస్థలికి చేరుకున్న వైద్య బృందం ఆమెను పరీక్షించి.

Advertisement

మరణించి చాలాసేపు అయినట్లు ప్రకటించారు.దర్యాప్తులో భాగంగా ఇంటిని అణువణువునా గాలించిన పోలీసులు రక్తంతో నిండిన దుస్తులను, కుక్క వెంట్రుకలను గుర్తించారు.

ఇదే సమయంలో బెడ్‌రూమ్‌లో మాథ్యూస్ చీలమండకు సంబంధించిన మాంసపు ముద్ద లభించింది.ఇంటి బయట ఎన్‌క్లోజడ్ డెక్ వద్ద ‘‘ గ్రేట్ డేన్స్’’ జాతికి చెందిన రెండు భారీ కుక్కలను పోలీసులు కనుగొన్నారు.ఈ దారుణంపై మాథ్యూస్ భర్త .డేల్ మాథ్యూస్ మాట్లాడుతూ ఈ రెండు కుక్కలలో ఒకదానిని తాము దుర్మార్గుడు అని పిలుస్తామని.ఎందుకంటే అది గతంలో తనతో పాటు పలవురు స్థానికులపై దాడి చేసి గాయపరిచిందని తెలిపారు.

తాను కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగానని కాని తన భార్య పొట్టిగా ఉండటం వల్ల వాటికి బలైపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.పోస్ట్‌మార్టం నివేదికలోనూ కుక్కల దాడి కారణంగానే మాథ్యూస్ ప్రాణాలు కోల్పోయిందని వెల్లడయ్యింది.

పెరుగుతోన్న వలసలు.. రిషి సునాక్ చేతికి ‘‘ రువాండా పాలసీ ’’ , ఇక ఎవరూ ఆపలేరన్న యూకే ప్రధాని

Advertisement

తాజా వార్తలు