హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాకు అధికారులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు, పెడ్లర్ల ప్లాన్లను చిత్తు చేస్తున్నారు.
నగర శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ ను డంప్ చేశారన్న సమాచారంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాను గుర్తించి సీజ్ చేశారు.
అదేవిధంగా నగరంలో అధికారుల తనిఖీలు ఎక్కువ కావడంతో డ్రగ్స్ తయారీకి ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేసుకున్నారు కేటుగాళ్లు.
పైకి ల్యాబ్ లుగా చలామణీ అవుతున్న లోపల మాత్రం డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు.ఇందులో భాగంగానే హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా పలు ఆర్డర్లను తీసుకుందని తెలుస్తోంది.
దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈనెల 21 నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.చెంగిచెర్ల ఉప్పల్ లో రూ.50 కోట్ల మెఫిడ్రిన్ ను సీజ్ చేశారు.అదేవిధంగా చర్లపల్లి, బోడుప్పల్ లోని రెండు ల్యాబ్ లలో మెఫిడ్రిన్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అనంతరం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.







