జనతా గ్యారేజ్ లో హై లైట్ ఇదే

నాన్నకు ప్రేమతో సినిమా తరవాత ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు.టెంపర్ – నాన్నకు ప్రేమతో తో వరస హిట్ లు కొట్టిన బుడ్డోడు ఈ సినిమా తో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలి ని ప్లాన్ చేస్తున్నాడు.

 Ntr’s Janatha Garage Highlights-TeluguStop.com

శ్రీమంతుడు కాంతి బడా బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద డైరెక్టర్ అయిపోయిన కొరటాల శివ డైరెక్షన్ లో ఒస్తున్న ఈ సినిమా విషయం లో శివ కథ – కథనం హై లైట్ గా చెబుతున్నారు.మోహన్ లాల్ ప్రత్యెక పాత్ర చేసిన ఈ సినిమా కి శివ రాసుకున్న కథ ఒక వెన్నుముక లాగా నిలుస్తుంది అని అంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమా తెలుగు, తమిళ్, మళయాల భాషల్లో కూడా ’జనతా గ్యారేజ్’ అన్న పేరునే ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకి సంబంధించి సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ని రేపు సాయంత్రం (మే 19) ఆరుగంటలకు విడుదల చేస్తుండగా మళయాలం వెర్షన్ ఫస్ట్ లుక్ ని మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21 న విడుదల చేస్తున్నారు.ఆగష్టు 12 న విడుదల అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube