ఆర్ఆర్ఆర్‌లో మూడు.. పండగ చేసుకోనున్న తారక్ ఫ్యాన్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

 Ntr To Show Three Shades In Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

అయతే ఈ సినిమాలో తారక్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట జక్కన్న.

దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో తారక్ ఏకంగా మూడు విభిన్న షేడ్స్‌లో మనకు కనిపిస్తాడట.

ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో కనిపిస్తున్న తారక్ మరో రెండు షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.దీనికి సంబంధించిన షూటింగ్ కూడా తారక్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఒక పాత్రలో క్రూర జంతువుతో పోరాడే అవతారంలో తారక్ కనిపించగా, మరో పాత్రలో గుండుతో కనిపిస్తాడట.ఈ సీన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ను చాలా సీక్రెట్‌గా జరిపినట్లు తెలుస్తోంది.

మొత్తానికి తారక్ ఆర్ఆర్ఆర్‌లో కేవలం కొమురం భీం పాత్రలో కాకుండా మరో రెండు షేడ్స్‌లో మనల్ని అలరించేందుకు రెడీ అయ్యాడని సినీ వర్గాల టాక్.ఏదేమైనా తారక్‌ ఇలాంటి భారీ సినిమాలో మూడు షేడ్స్‌లో నటిస్తున్నాడంటే ఆ పాత్రలు ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube