ఎప్పుడెప్పుడా అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీజర్‌ను ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఈ సినిమాలోని కొమురం భీం పాత్రలో నటిస్తున్న తారక్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
మొదట్నుండీ చెబుతున్నట్లుగానే ఎన్టీఆర్ ఈ టీజర్‌తో అరాచకం సృష్టించాడు.ఈ సినిమాలో మన్యం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి కొమురం భీం పాత్రను రాజమౌళి ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తున్నాడో ఈ టీజర్ చూస్తూ మనకు ఇట్టే అర్ధమవుతుంది.
ఇక ఈ టీజర్‌కు రామ్ చరణ్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఈ టీజర్ చూస్తున్నవారికి గూస్‌బంప్స్‌ను తీసుకొచ్చింది.కొమురం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ తనను తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్న విధానం చూస్తుంటే ఔరా అనకుండా ఉండేలం.
బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కాకుండా మరే హీరో సెట్ కాడేమో అనే రేంజ్‌లో తారక్ ఈ పాత్రలో ఒదిగిపోయాడు.
మొత్తానికి ఇంతకాలం వెయిట్ చేసిన ప్రేక్షకులకు జక్కన్న అండ్ టీమ్ ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పాలి.
ఈ సినిమాలో తారక్ పాత్ర ప్రేక్షకులకు ఎల్లకాలం గుర్తుండిపోయే విధంగా రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడు.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ టీజర్ ఉండటతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.