టాలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కళ్లు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన కానున్న విషయం తెలిసిందే.సినిమా పై అభిమానులు ఏ రేంజిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు మనందరికీ తెలిసిందే.
ఇందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటం, అదే విధంగా బాహుబలి సినిమా లాంటి సినిమాను తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి.
మరి ప్రేక్షకులు అంచనాల కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా? ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది?మెగా అభిమానులను,అలాగే నందమూరి అభిమానులను ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.ఇది ఎలా ఉంటే ఈ సినిమాకు పనిచేసిన కలరిస్ట్ శివ కుమార్ చెప్పేసాడు.నేను ఇప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమాను చూసాను.ఒక కలరిస్ట్ గా ప్రతి ఫ్రేమ్ ని వెయ్యి సార్లు చూశాను.చివరి కాపీ చూసినప్పుడు ఒక రెగ్యులర్ ఆడియెన్ లా ఎమోషనల్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు శివకుమార్.అంతే కాకుండా ఈ సినిమా పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని బలంగా నమ్ముతున్నాను రాసిపెట్టుకోండి అని తెలిపారు.

ఇక ఈ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించారు.ఈ సినిమా 1920 నేపథ్యంలో బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఫిక్షనల్ పిరియాడిక్ సినిమాగా తెరకెక్కబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు,పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల నడుమ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.