జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.
ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ( Devara ) చేస్తున్న విషయం తెలిసిందే.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.ప్రస్తుతం నీల్ కూడా సలార్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యాక నీల్ కాస్త ఫ్రీ అవ్వనున్నాడు.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పనులను జనవరి తర్వాత స్టార్ట్ చేయనున్నారట.
ప్రీ ప్రొడక్షన్ పనులను నీల్ స్టార్ట్ చేస్తారని 2025 సమ్మర్ తర్వాత ఎన్టీఆర్ తో నీల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.ఏది ఏమైనా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )హీరోయిన్ గా నటించబోతుంది అనే రూమర్స్ హల్చల్ చేయగా ఇంకా ఏ నటీనటులను అయితే మేకర్స్ ఫిక్స్ చేయలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy